: ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు


ప్రధాని నేతృత్వంలో నేడు ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తన బావ హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండదని అందరూ భావించారు. అయితే పలు కీలక అంశాలపై ప్రధాని నిర్వహిస్తున్న సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనన్న కేంద్రం సూచనతో ఆయన ఢిల్లీ బయలుదేరక తప్పలేదు. ఆయన ఢిల్లీలో ఉండగానే, నేటి మధ్యాహ్నం జానకీరామ్ అంత్యక్రియలు ముగియనున్నాయి.

  • Loading...

More Telugu News