: అమెరికాలో కొనసాగుతున్న నల్లజాతీయుల నిరసనలు
అమెరికాలో శ్వేతజాతి పోలీసులు, ఆ దేశ కోర్టు వైఖరిని నిరసిస్తూ నల్లజాతీయులు చేపట్టిన ఆందోళనలు వరుసగా మూడో రోజు కూడా కొనసాగాయి. నల్లజాతి వ్యక్తి ఎరిక్ గార్నర్ ను అరెస్ట్ చేసిన సందర్భంగా అమెరికా పోలీసుల అమానుష వైఖరి నేపథ్యంలో అస్థమా రోగి అయిన అతడు చనిపోయాడు. అయితే దీనిపై విచారణ చేపట్టిన ఆ దేశ కోర్టు శ్వేతజాతి పోలీసులపై కేసు నమోదుకు నిరాకరించింది. దీంతో మూడు రోజుల క్రితం పోలీసుల కఠిన వైఖరి, కోర్టు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నల్లజాతీయులు ఆందోళనలకు దిగారు. వరుసగా మూడో రోజైన శనివారం కూడా నల్లజాతి పౌరులు తమ నిరసనలను కొనసాగించారు. దేశంలోని పలు నగరాల్లో శాంతియుతంగానే నిరసన ప్రదర్శనలు చేపట్టిన నల్లజాతీయులు, శనివారం మన్ హట్టన్ లోని పండ్ల దుకాణంలో ర్యాలీ నిర్వహించారు.