: నేడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జానకీరామ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు
సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ కుమారుడు జానకీరామ్ మృతదేహానికి నేటి మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న క్రమంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకీరామ్ మరణించిన సంగతి తెలిసిందే. జానకీ రామ్ మృతదేహానికి శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. నేటి మధ్యాహ్నం దాకా అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని మాసాబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసంలో ఉంచనున్నారు. అనంతరం భౌతిక కాయాన్ని పంజాగుట్ట శ్మశాన వాటికకు తరలిస్తారు.