: మూగబోయిన హరికృష్ణ నివాసం
సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ నివాసంలో విషాదచాయలు అలముకున్నాయి. హరికృష్ణ తనయుడు జానకీరామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, ఆయన నివాసానికి బంధుమిత్రులు, సన్నిహితులు పోటెత్తారు. బంధువులంతా విషాదంలో మునిగిపోయారు. బంధువుల్లో జానకీరామ్ కు మంచి పేరుంది. అందర్నీ కలుపుకుపోయే వ్యక్తిగా, అజాత శత్రువుగా ఆయనను పేర్కొంటారు.