: మంత్రులతో ముగిసిన బాబు భేటీ... పరిహార ప్యాకేజీలు ఖరారు!
నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం, మార్గదర్శకాల రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులతో జరిపిన సమావేశం ముగిసింది. మంత్రులు నారాయణ, కిషోర్‌బాబు, రఘునాథరెడ్డి లతో చర్చించిన చంద్రబాబు భూసమీకరణకు సంబంధించి పరిహార ప్యాకేజీలను ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు భూములను మూడు రకాలుగా విభజించి ప్యాకేజీలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రైతు నాయకులతో భేటీ అనంతరం ప్యాకేజీ వివరాలను బాబే స్వయంగా వెల్లడిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.