: అమ్మాయిలతో జల్సాల కోసం ఖరీదైన కార్లచోరీ


యువత తప్పుడు మార్గాల్లోకి చాలా సులువుగా దారి మళ్లుతున్నారు. జల్సాలు, అమ్మాయిల మోజులో పడి నిండుజీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. పబ్బుల్లో, క్లబ్బుల్లో అమ్మాయిలతో షికార్ల కోసం సుమన్ (25) అనే ఇంజనీరింగ్ పట్టభద్రుడు చోరీల బాటపట్టాడు. హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీకి చెందిన సుమన్ విలాసాలకు అవసరమైన డబ్బులేకపోవడంతో జూబ్లిహిల్స్ లోని దసపల్లా హోటల్ వ్యాలెట్ పార్కింగ్ లోని డ్రా నుంచి ఓ కారు తాళం తీసుకుని ఉడాయించాడు. అది ఓ అడ్వొకేట్ కు చెందిన బీఎండబ్ల్యూ కారు. అతను తన పని ముగించుకుని వచ్చి చూసేసరికి తన కారు కనబడలేదు. దీంతో షాక్ అయిన ఆ అడ్వొకేట్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, హోటల్ లోని సీసీ కెమేరా పుటేజీ పరిశీలించారు. దీంతో సుమన్ నిర్వాకం బట్టబయలైంది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. దీంతో గతంలో బేగంపేట బాటిల్స్ అండ్ చిమ్నీస్ వ్యాలెట్ పార్కింగ్ లో కూడా రెండు కార్లు దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. చోరీ చేసిన కార్ల నెంబర్ ప్లేట్లు మార్చి అమ్మాయిలతో షికార్లు చేయడం, పబ్బులు, క్లబ్బుల్లో జల్సా చేయడం కోసం కార్లు చోరీ చేశానని సుమన్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News