: అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం పునఃప్రారంభం: ఏపీ మంత్రి రావెల


ఎస్సీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని పునఃప్రారంభించామని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పథకం సరిగా అమలు కాలేదని చెప్పారు. దీనిని మరింత విస్తృతం చేస్తూ ఎక్కువ మంది విదేశాల్లో చదువుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆయన తెలిపారు. గతంలో ఐదు దేశాల్లో విద్యనభ్యసించేందుకు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉండేదని చెప్పిన ఆయన, ఇప్పుడీ పథకాన్ని మరో పది దేశాలకు విస్తృతం చేశామని అన్నారు. పీజీ డిప్లొమా కోర్సులు, నర్సింగ్, ఛార్టర్డ్ అకౌంటెన్సీ వంటి కోర్సులను ఈ పథకంలో చేర్చామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అర్హులకు 10 లక్షల రూపాయల ఆర్ధిక సాయంతోపాటు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మరో ఐదు లక్షల రూపాయల బ్యాంకు రుణాలు అందిస్తామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News