: సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ కు కోర్టు క్లీన్ చిట్
సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ కు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. గతంలో ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ, తానెటువంటి తప్పు చేయలేదని శ్వేత కొన్ని రోజుల కిందట నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు ముందు... తనను కావాలనే పోలీసులు ఇరికించారని, ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు వచ్చిన తాను ఆ హోటల్ కు వెళ్లానని శ్వేత వాదించింది. ఈ క్రమంలో ఆమె వాదనలతో ఏకీభవించిన కోర్టు కేసును కొట్టివేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. అటు కోర్టు తీర్పుపై శ్వేతాబసు హర్షం వ్యక్తం చేసింది. చాలా రోజుల తరువాత తన కుటుంబ సభ్యుల మొహాల్లో నవ్వు, ఆనందం చూస్తున్నానంది.