: నెల్లూరు జేసీ రేఖారాణిపై టీడీపీ నేతల అసంతృప్తి


నెల్లూరు జిల్లాలోని కుగ్రామం పీఆర్ కండ్రిగను దత్తత తీసుకోవడానికి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ఇన్స్ పెయిర్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణిపై తెలుగుదేశం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేఖారాణి ప్రజా ప్రతినిధులను గౌరవించటం లేదంటూ టీడీపీ సభ్యులు జెడ్పీ సమావేశంలో నిరసన తెలిపారు. ఆమె వైఖరి సరిగా లేదంటూ, టీడీపీ సభ్యులు నేడు ఆందోళనకు దిగారు. జెడ్పీ సమావేశాలకు రాకుండా రేఖారాణి తప్పించుకుంటున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News