: 'జువెనైల్ జస్టిస్ బిల్లు-2014'పై మా వైఖరిలో మార్పు లేదు: కేంద్ర ప్రభుత్వం
అతి క్రూరమైన లేదా హేయమైన నేరాలకు పాల్పడే బాలనేరస్థుల వయసు 18 ఏళ్ల నుంచి 16కు తగ్గిస్తూ తీసుకొచ్చిన 'జువెనైల్ జస్టిస్ బిల్లు-2014'లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ ఏడాది ఆగస్టు 12న లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని బాలల మహిళాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. బాలనేరస్థుల వయసు తగ్గింపు విషయంలో ఎటువంటి సమస్య లేదని, కేవలం మీడియాలోనే పలు కథనాలు వస్తున్నాయని పేర్కొంది. అయితే, బాలనేరస్థుల వయసు తగ్గించడంపై మీడియాలో విమర్శలు చేస్తూ వార్తలు వచ్చిన క్రమంలోనే కేంద్రం పైవిధంగా ప్రకటన చేసింది.