: చైనాలో స్వల్ప భూకంపం
చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్సులో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ఉదయం 2.43 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూమికి 9 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉందని 'చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్ సెంటర్' తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయని ప్రకటించింది. భూకంపం సంభవించిన వెంటనే ప్రభావిత ప్రాంత పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.