: మహరాష్ట్రలో తొలి కేబినెట్ విస్తరణ
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా కేబినెట్ విస్తరణ చేపట్టింది. ముంబయిలోని విధాన్ భవన్ ప్రాంగణంలో పది మందితో మంత్రులుగా గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో ఐదుగురు బీజేపీ నుంచి, మరో ఐదుగురు శివసేన నుంచి మంత్రులుగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరారు. వారి చేరికతో మంత్రుల సంఖ్య ఇరవైకి చేరింది. ఈనెల 8 నుంచి కీలకమైన శీతాకాల శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలోనే బీజేపీ ఈ విస్తరణ చేపట్టింది.