: చెరువుల పునరుద్ధరణ సీఎం స్వప్నం: కవిత
ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాలకు గురై, ఆదరణకు నోచుకోని చెరువుల పునరుద్ధరణే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నమని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో ప్రతి ఇంటికి మంచి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.