: పవన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు: ఫేస్ బుక్ లో రేణుదేశాయ్
"నిన్నటి నా ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా జీవితంలో జరిగిన ఏ విషయానికీ ఆయనను బాధ్యుడిని చేయలేదు" అని పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన ప్రతిఒక్కరికీ ఈ రోజు ఉదయం ఆమె ఫేస్ బుక్ లో కృతజ్ఞతలు తెలిపారు. ఒక మనిషిగా పవన్ ను తాను నిజంగా గౌరవిస్తానని ఆమె తెలిపారు. కొన్ని పరిణామాల పట్ల బాధగా ఉందని, పవన్ ను చెడు వ్యక్తిగా చూపలేనని రేణు వివరించారు. 'ఎవరూ ఆయన గురించి నెగటివ్ గా మాట్లాడవద్దు' అని సూచించారు. కొన్ని అసత్య ఆరోపణలపై అభిప్రాయాలు చెప్పేందుకే ఇంటర్వ్యూ ఇచ్చానని తెలిపారు.