: తెలంగాణ సాంస్కృతిక శాఖ ఛైర్మన్ గా ఎమ్మెల్యే 'రసమయి' బాలకిషన్
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఛైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, గాయకుడు 'రసమయి' బాలకిషన్ నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. సాంస్కృతిక శాఖ భవనాన్ని సదరు కార్యక్రమాల నిర్వహణకు, సాంస్కృతిక పరమైన శిక్షణా కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకోవాలని చెప్పారు. హరిత హారం, చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలపై ప్రచార యుద్ధం సాగించాలని సీఎం పిలుపునిచ్చారు.