: రైతులు సంతోషంగానే ఉన్నారు... మీకెందుకంత బాధ?: జగన్ కు పరిటాల సునీత ప్రశ్న
ఏపీలో రుణమాఫీ అమలుపై మహాధర్నా చేేపట్టిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రుల మాటల దాడి కొనసాగుతోంది. ఈ ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మొదలుపెట్టిన ఎదురుదాడిని మంత్రి గంటా గంటా శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొనసాగించారు. వారు జగన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. కొద్దిసేపటి క్రితం పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. తాము ప్రకటించిన రుణమాఫీతో రైతులు సంతోషంగానే ఉన్నారన్న ఆమె అసలు జగనెందుకు బాధపడుతున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే రుణమాఫీపై ప్రకటన చేస్తే స్వాగతించాల్సిందిపోయి విమర్శించడం జగన్ కు తగదన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని జగన్ కు ఆమె సూచించారు.