: పవార్కు పూర్తయిన శస్త్రచికిత్స
ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్కు వైద్యులు శస్త్రచికిత్సను నిర్వహించారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తన నివాసంలో కాలుజారి కిందపడటంతో పవార్ ను ముంబై తరలించిన సంగతి తెలిసిందే. ఆయన కాలికి డాక్టర్లు మైనర్ సర్జరీ చేశారని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ నేటి మధ్యాహ్నం మీడియాకు వెల్లడించారు. మరో ఎనిమిది రోజుల పాటు పవార్ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్టు తెలిపారు.