: ఈ నెల 15న ఏపీ మంత్రివర్గ సమావేశం


ఏపీ మంత్రివర్గం ఈ నెల 15న సమావేశం కానుంది. రుణమాఫీ విధివిధానాల ప్రకటన దరిమిలా జరుగుతున్న ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలక అంశాలపై చర్చించనుందని సమాచారం. ఇటీవల జరిగిన ఎర్రచందనం వేలంలో ఊహించిన దానికంటే అధికంగా ఆదాయం సమకూరిన నేపథ్యంలో, మలిదశ వేలంపై ఈ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేగాక, రాజధాని నిర్మాణానికి సంబంధించి సాంకేతిక సహకారం, నిర్మాణంలో ప్రత్యక్ష పాత్రలకు సంబంధించి సింగపూర్, జపాన్ ల నుంచి సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో, భూ సేకరణను వేగవంతం చేయాలని సర్కారు భావిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు రైతుల నుంచి విముఖత వ్యక్తమవుతున్నందున, ఏ తరహా చర్యల ద్వారా ఈ అవాంతరాలను అధిగమించవచ్చన్న అంశంపైనా మంత్రివర్గం దృష్టి సారించనుంది.

  • Loading...

More Telugu News