: అడిలైడ్ టెస్టులో తొలి బంతినే బౌన్సర్ గా విసరండి: మెర్వ్ హ్యూస్ సూచన


ఫిలిప్ హ్యూస్ మరణంతో ఇప్పుడు బౌన్సర్ సంధించాలంటే బౌలర్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఆసీస్ పేస్ దిగ్గజం మెర్వ్ హ్యూస్ స్పందించాడు. బౌన్సర్లు ఆటలో భాగమేనని, వాటిపై చర్చను పొడిగించాల్సిన అవసరం లేదనీ అన్నాడు. అందుకే, ఆసీస్-భారత్ మొదటి టెస్టులో తొలి బంతినే బౌన్సర్ గా విసిరితే ఏ సమస్య ఉండదని అన్నాడు. అలా కాకుండా, బౌన్సర్ విసరకుండా ఉంటే, మనపై మనమే ఒత్తిడి పెంచుకున్నట్టువుతుందని అభిప్రాయపడ్డాడు. ఒక్కసారి బౌన్సర్ విసిరితే వాతావరణం తేలికపడుతుందని విశ్లేషించాడు. దానిపై దీర్ఘకాలిక చర్చతో నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువని పేర్కొన్నాడు. అంతేగాకుండా, కెప్టెన్ మైకేల్ క్లార్క్ చెప్పినట్లుగా పోటీతత్వంతో కూడిన క్రికెట్ ఆడడమే హ్యూస్ కు నిజమైన నివాళి అని తెలిపాడు.

  • Loading...

More Telugu News