: జగన్ మహాధర్నాకు నిరసనగా బెజవాడలో టీడీపీ ఆందోళన
రుణమాఫీ అమలులో సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మహాధర్నాకు కౌంటర్ గా టీడీపీ ఆందోళనకు దిగింది. జగన్ విశాఖలో మహాధర్నాకు దిగితే, ఆయన తీరును నిరసిస్తూ టీడీపీ బెజవాడలో ధర్నాకు దిగడం విశేషం. అయితే, అధికార పార్టీ తరఫున ధర్నా జరుగుతున్న వైనాన్ని మీడియా ప్రస్తావించిన సందర్భంగా టీడీపీ బెజవాడ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న సరికొత్తగా స్పందించారు. తాము చేస్తున్నది ధర్నా కాదని, చెడు వినకు, చూడకు, మాట్లాడకు... అన్న మహాత్మా గాంధీ సలహాను పాటించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు ఆయన చెప్పారు. అంతేగాక, సదరు నిరసనను ఆయన గాంధీజీ విగ్రహం ముందు చేపట్టడం విశేషం.