: భారత్ కు 'థాంక్స్' చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా డైరెక్టర్


యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో, భారత్ తమకెంతగానో సహకరించిందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. షెడ్యూల్ మార్పు అంశంలో పర్యాటక జట్టు అందించిన తోడ్పాటు తమకు ఇబ్బందులు తగ్గించిందని క్రికెట్ ఆస్ట్రేలియా డైరెక్టర్ మైకేల్ కాస్ప్రోవిజ్ తెలిపారు. షెడ్యూల్ మార్చుతున్నట్టు చెప్పగానే, టీమిండియా మేనేజ్ మెంట్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా అంగీకరించిందని అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు వారికి థాంక్స్ చెబుతున్నామని పేర్కొన్నారు. హ్యూస్ అంత్యక్రియలకు రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, డంకన్ ఫ్లెచర్ వచ్చారని, ఆ సందర్భంగా తాను శాస్త్రితో మాట్లాడానని కాస్ప్రోవిజ్ వివరించారు. శాస్త్రి టెస్టు సిరీస్ తేదీల మార్పుకు వెంటనే సమ్మతి తెలిపాడని చెప్పారు. ఇక, ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా తొలి టెస్టును ఆడడం ద్వారా 'హ్యూస్ పేజీ'ని తిప్పేస్తారని భావిస్తున్నామని అన్నారు. హ్యూస్ మరణం అంతర్జాతీయంగా ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. తొలి టెస్టు ఆడడమే హ్యూస్ కు సరైన నివాళి అన్న కోచ్ డారెన్ లేమన్ తో తాను ఏకీభవిస్తున్నానని కాస్ప్రోవిజ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News