: చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు: రఘువీరా


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నిన్న చంద్రబాబు ప్రకటించిన విధాన ప్రకటన మొత్తం అసత్యాలతో నిండి ఉందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. రకరకాల కారణాలతో రైతులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

  • Loading...

More Telugu News