: ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్ల మృతి... ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్ లో మరోమారు పాకిస్థానీ ఉగ్రవాదులు బరి తెగించారు. నేటి తెల్లవారుజామున భారత జవాన్ల గుడారాల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు నేలకొరిగినట్లు సమచారం. ఊహించని ఉగ్రదాడుల నుంచి తేరుకున్న సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లా పరిధిలోని యూరీ సెక్టార్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో తెల్లవారుజాము నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.