: టీఎస్ ప్రభుత్వ నిర్వాకం... రాష్ట్రానికి కేంద్రం నుంచి కరవు నిధులు రానట్టే!


తెలంగాణ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఈ ఏడాది కరవు నిధులు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. కరవుకు సంబంధించి టీఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞాపన పత్రం సమర్పించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లోక్ సభలో స్పష్టం చేశారు. కరవు ప్రకటన చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని... కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయదని చెప్పారు. రాష్ట్రాలు కరవు ప్రకటన చేసిన తర్వాత, కేంద్ర బృందాలను పంపి అధ్యయనం చేయించి, నిధులను విడుదల చేస్తామని వెల్లడించారు. ఇతర కరవు రాష్ట్రాలకు తగిన రీతిలో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి ప్రకటనతో తెలంగాణ రైతులకు మరిన్ని చిక్కులు వచ్చి పడ్డట్టయింది.

  • Loading...

More Telugu News