: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ పయనం


తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న ఆయన నేటి రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎంల సదస్సులో పాల్గొనే కేసీఆర్... ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విధులపై కేసీఆర్ ప్రస్తావించనున్నారు. తమ వాదనను కేంద్రం వద్ద బలంగా వినిపించేందుకు సమగ్ర నివేదికలతో ఆయన ఢిల్లీ చేరనున్నారు. ఇప్పటికే పలు అంశాలకు చెందిన నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సిద్ధం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు, ప్రభుత్వ సంస్థల విభజన, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, వాటర్ గ్రిడ్లతో పాటు ఎస్సీ వర్గీకరణ, ఉపాధి హామీ పథకం కొనసాగింపు, శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్పు తదితర అంశాలనూ ఆయన కేంద్రం వద్ద ప్రస్తావించేందుకు సమాయత్తమవుతున్నారు.

  • Loading...

More Telugu News