: మాధురీ దీక్షిత్ కు చోటా రాజన్ గ్యాంగ్ బెదిరింపులు


డబ్బుల కోసం బెదిరింపులకు దిగే చోటా రాజన్ గ్రూపు మళ్లీ ముంబైలో కాలుమోపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ కు బెదిరింపు సందేశాలు పంపిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్న యువకుడు మాధురీ దీక్షిత్ ను డబ్బు కోసం బెదిరించాడు. అడిగిన మేర డబ్బివ్వకుంటే నీ పిల్లలను చంపేస్తానని ఆమె మొబైల్ కు సందేశాలు పంపిన యువకుడు ప్రవీణ్ కుమార్ ప్రదాన్, ముంబై గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ అనుచరుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాను చెప్పిన మేర డబ్బులను తన అకౌంట్ కు బదిలీ చేయాలని ప్రవీణ్ మాధురీని బెదిరించాడు.

  • Loading...

More Telugu News