: నేడు ఫడ్నవిస్ సర్కారులో ‘సేన’ చేరిక


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కేబినెట్ లో నేడు శివసేన సభ్యులు చేరనున్నారు. నేడు జరగనున్న కేబినెట్ తొలి విస్తరణలో 10 మంది శివసేన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదు కేబినెట్ పోస్టులతో కలుపుకుని మొత్తం 12 మంది సేన ఎమ్మెల్యేలను తన కేబినెట్ లోకి చేర్చుకుంటున్న ఫడ్నవిస్... రెవెన్యూ, పరిశ్రమలు తదితర కీలక శాఖలను వారికి అప్పగించేందుకు సమ్మతించారు. రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో పొడచూపిన విభేదాల నేపథ్యంలో 25 ఏళ్ల నాటి మైత్రికి బీజేపీ, శివసేనలు తిలోదకాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మహారాష్ట్రలో స్థిరమైన పాలనను అందించేందుకే ఫడ్నవిస్ సర్కారులో చేరుతున్నట్లు శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయ్ చెప్పారు.

  • Loading...

More Telugu News