: రింగురోడ్డుపై లారీని ఢీకొన్న కారు... ఒకరు మృతి


యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వారు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారు. వీరంతా షిర్డీ నుంచి ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

  • Loading...

More Telugu News