: పోలీసు జీపుపై కాల్పులు జరిపిన దుండగులు
అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఓ పోలీసు జీపుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎస్సై మధుకర్ రెడ్డితో పాటు సిబ్బంది ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.