: ఈ రోజు జరగాల్సిన జీశాట్-16 ప్రయోగం వాయిదా


ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగిస్తున్న జీశాట్-16 ప్రయోగం వాయిదా పడింది. ఈ తెల్లవారుజామున జరగాల్సిన ప్రయోగాన్ని ప్రతికూల వాతావరణం కారణంతో వాయిదా వేశామని అధికారులు తెలిపారు. 3 వేల కిలోలకు పైగా బరువున్న ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. జీశాట్-16 భారత్ ప్రయోగిస్తున్న 11వ సమాచార ఉపగ్రహం. ఇందులో రికార్డు స్థాయిలో ఏకంగా 48 ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News