: శంషాబాద్ లో యువతి కిడ్నాప్ కు యత్నంచిన క్యాబ్ డ్రైవర్
హైదరాబాదులోని క్యాబ్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. శంషాబాదు విమానాశ్రయంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయిన ఓ యువతిని క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ కు యత్నించడం కలకలం రేపుతోంది. క్యాబ్ డ్రైవర్ తనను కిడ్నాప్ చేయబోయాడని యువతి ఆరోపిస్తోంది. తనను తాను రక్షించుకునేందుకు 100కు డయల్ చేసి సమాచారం అందించినట్టు తెలిపింది. దానిని పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తమై తనను అప్పా జంక్షన్ వద్ద వదిలేసినట్టు యువతి వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.