: తెలంగాణలో అమిత్ షా రెండు రోజుల పర్యటన ఖరారు


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 27న వరంగల్ లో బీజేపీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. 28న హైదరాబాదులోని పార్టీ ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశం అవుతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని పటిష్ఠం చేసే దిశగా అమిత్ షా ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్రంతో రాష్ట్రానికి పొసగని నేపథ్యంలో ఆయన పార్టీని పటిష్ఠం చేసేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేయనున్నారని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News