: మోదీ బొగ్గు రంగాన్ని కార్పోరేట్ పరం చేయాలనుకుంటున్నారు: దిగ్విజయ్


బొగ్గు రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ చర్య... ఇందిర పాలనకు ముందున్నటువంటి కార్మిక శక్తి 'దోపిడీ' తాలూకు 'చేదు జ్ఞాపకాల'ను గుర్తుచేసేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ మేరకు రాంచీలో ఆయన మాట్లాడుతూ... ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. మోదీ 'మేక్ ఇన్ ఇండియా' అంటూనే బొగ్గు రంగాన్ని కార్పోరేట్ చేతుల్లో పెట్టాలనుకుంటున్నారని చెప్పారు. లక్షల మంది కార్మికులపై దోపిడీకి పాల్పడడాన్ని ప్రైవేట్ రంగం ఆపాలని డిగ్గీ కోరారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బొగ్గు పరిశ్రమను జాతీయం చేసి పేద, ఆదివాసులకు లబ్ది చేకూర్చేలా వ్యవహరించారని చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు మళ్లీ అదే దోపీడికి దారి తీస్తాయని హెచ్చరించారు. మునుపటి మన్మోహన్ సింగ్ పాలనలో చేసిన బొగ్గు విధానం తుది వినియోగదారులకు లబ్ది చేకూర్చేలా చేసిందన్నారు.

  • Loading...

More Telugu News