: గుజరాత్ సీఎం నన్ను మెచ్చుకున్నారు: అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గుజరాత్ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తన పనితీరును గుజరాత్ సర్కారు గుర్తించిందని, సీఎం ఆనంది బెన్ పటేల్ మెచ్చుకున్నారని బిగ్ బి ట్విట్టర్లో పేర్కొన్నారు. తన సేవలకు గుర్తుగా ఓ జ్ఞాపిక, శాలువా బహుకరించారని ఈ మేరకు ఫొటో పోస్టు చేశారు. గుజరాత్ సీఎం కుమార్తె, అల్లుడు ఇప్పటికే ఈ రంగంలో సేవలందిస్తున్నారని, వారే తనకు ఈ అవకాశం కల్పించారని అమితాబ్ పేర్కొన్నారు.