: సెకనుకు 100 బిలియన్ ఫ్రేమ్స్ వేగంతో ఫొటోలు తీయగల సూపర్ కెమెరా
అమెరికాకు చెందిన బయో మెడికల్ ఇంజనీర్ల బృందం ప్రపంచపు అత్యంత వేగవంతమైన కెమెరాను ఆవిష్కరించింది. ఈ 2డీ కెమెరా సెకనుకు 100 బిలియన్ ఫ్రేమ్ లను బంధించగలదు. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక కెమెరాలు సెకనుకు 10 మిలియన్ ఫ్రేమ్‌లను బంధించేవి. కాగా, ఈ కెమెరాను బయో మెడిసిన్, ఫోరెన్సిక్, ఆస్ట్రానమీ తదితర విభాగాలలో వాడతారు.