: లోక్ సభలో తీవ్ర గందరగోళం... వాకౌట్ చేసిన విపక్షాలు
కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంటు ఉభయసభలను అట్టుడికిస్తున్నాయి. రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యాఖ్యలు చేసిన జ్యోతి తన పదవికి రాజీనామా చేయాలని... లేదా బలవంతంగా ఆమెను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్ సభ నుంచి కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ సభ్యులు వాకౌట్ చేశారు.