: తన పేరు మరెవరికీ ఉండరాదంటూ ఆదేశించిన ఉత్తర కొరియా నియంత


ఉత్తర కొరియా నియంతృత్వ, సైనిక పాలకుడు కిమ్ జోంగ్ యున్ (31) ఇకపై తన పేరు మరెవరికీ ఉండరాదని ఆదేశాలు జారీ చేశాడు. కొత్తగా పుట్టే పిల్లలకు తన పేరు పెట్టరాదని, ఇప్పటికే తన పేరు కలిగిన వారు దాన్ని మార్చుకోవాలని ఆదేశించాడు. జనన ధృవీకరణ పత్రాలు, ఇంటి పత్రాలు, తదితరాల్లో కూడా తన పేరు ఉన్నవారు వెంటనే మార్పించుకోవాలని హుకుం జారీ చేశాడు. అంతేకాకుండా, తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సంగ్ పేర్లను కూడా నిషేధించాడు. ఈ వివరాలను దక్షిణ కొరియా ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News