: ఫేస్ బుక్ పోస్ట్ లపై కాపీ రైట్ ఖాతాదారుడికే


సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌ బుక్‌లో ఖాతాదారులు పోస్ట్ చేసే సమాచారం, ఫొటోలు వారికే సొంతమని, వాటిని తాము అమ్మబోమని ఫేస్ బుక్ వర్గాలు స్పష్టం చేశాయి. ఫేస్‌ బుక్‌లో ఖాతా ప్రారంభించేటప్పుడు తమ సమాచారాన్ని ఉచితంగా ఉపయోగించుకునేందుకు ఖాతాదారులు అంగీకరించాల్సి ఉంటుంది. యూజర్లు పోస్ట్ చేసే ఫొటోలు, సమాచారాన్ని ఇతర ఫ్లాట్‌ ఫామ్‌లపై చూపేందుకు మాత్రమే ఈ లెసైన్సును వాడుకుంటామని, ఖాతాదారుల అనుమతి తీసుకోకుండా ఆ సమాచారాన్ని విక్రయించబోమని ఫేస్‌ బుక్ అధికారి మాట్ స్టీన్‌ ఫీల్డ్ తెలిపారు. తమ ఫొటోలను ఫేస్‌బుక్ అమ్ముకుంటుందేమోనని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫొటోగ్రాఫర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ వివరణ ఇచ్చింది.

  • Loading...

More Telugu News