: సాధ్వి వ్యాఖ్యలు మనందరికీ గుణపాఠం: మోదీ
కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వ్యాఖ్యలు, ఆపై జరిగిన రగడ ప్రతి ప్రజా ప్రతినిధికీ గుణపాఠం వంటివని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలను తాను కూడా ఖండించానని గుర్తు చేసిన ఆయన, వాడుతున్న భాష విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. సాధ్వి క్షమాపణలు చెప్పినా సభను అడ్డుకోవడం సరికాదని, సభకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.