: ఖైదీలే టీచర్లు, ఖైదీలే విద్యార్థులు... తీహార్ స్పెషల్!


ఢిల్లీలోని తీహార్ జైల్లో సంస్కరణలు మరింత ఊపందుకున్నాయి. ఖైదీలలో మార్పు తెచ్చేందుకు జైలు వర్గాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖైదీలకు ఆంగ్లం, పంజాబీ, ఉర్దూ తదితర భాషలపై క్లాసులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసంలో భాగంగా, వారికి చదవడం, రాయడం, మాట్లాడడం వంటి అంశాలను బోధించాలని నిర్ణయించామని, అందుకే ఈ భాషా బోధన తరగతులు చేపట్టామని జైలు ప్రతినిధి తెలిపారు. ఖైదీల్లో భాషా బోధనకు అర్హులను గుర్తించి, వారితోనే ఇతర ఖైదీలకు పాఠాలు చెప్పిస్తున్నామని వివరించారు. జైలు అధికారులే కోర్సు తీరుతెన్నులను రూపొందించారని, మొత్తమ్మీద 65 మంది ఖైదీలు ఈ క్లాసులతో లబ్దిపొందుతారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News