: మరో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని ప్రశ్నించనున్న సీబీఐ


శారదా గ్రూప్ చిట్ ఫండ్ స్కాంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ఎంపీ అహ్మద్ హసన్ ఇమ్రాన్ ను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను కొన్ని నెలల కిందట ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఈ క్రమంలో శారదా స్కాంకు సంబంధించిన నగదును బంగ్లాదేశ్ కు తరలించేందుకు సుదీప్తా సేన్ అనే వ్యక్తికి సహాయం అందించాడంటూ ఎంపీపై ఆరోపణలున్నాయి.

  • Loading...

More Telugu News