: రాష్ట్రాలకు సహాయంలో కోత తప్పదు: ఆర్థిక మంత్రి జైట్లీ సంకేతాలు


ఇకపై రాష్ట్రాలకు అందించే సహాయంలో కేంద్రం కోతల మంత్రాన్ని జపించనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రంగం సిద్ధం చేస్తున్నారు. 2015-16 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన పరోక్ష సంకేతాలిస్తూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన కేంద్రం వైఖరిని విస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రాలు సొంత వనరులను సమకూర్చుకోవడం ద్వారా స్వయం సమృద్ధం కావాలని జైట్లీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన నిధులను రాష్ట్రాలే సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. ‘‘కేంద్రం నుంచి సహాయం అందే రోజులు గతించాయి. రాష్ట్రాలు స్వయం పాలన దిశగా చర్యలు తీసుకోవాలి’’ అని జైట్లీ అన్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖను ప్రస్తావించిన ఆయన, పర్యాటక రంగంతో ఆ రాష్ట్రం భారీగా నిధులను సమకూర్చుకుంటోందని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లాగానే మిగిలిన రాష్ట్రాలు కూడా వాటి పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుని, సొంతంగా నిధులను సమకూర్చుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News