: 700 మంత్రాలు... పదివేల సార్లు పఠనం: కేసీఆర్ ఛండీయాగంపై దేశవ్యాప్తంగా చర్చ!
తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించతలపెట్టిన ఛండీయాగంపై దేశవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. మెదక్ జిల్లాలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఫిబ్రవరిలో కేసీఆర్ నిర్వహించనున్న ఈ యాగంపై దేశంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు ప్రధానంగా కథనాలు వెలువరించాయి. రాజకీయంగా తన శత్రువులను ఎదిరించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను కూడదీసుకునేందుకే కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారని ఆ కథనాలు పేర్కొన్నాయి. అంతేకాక ఛండీయాగం విశిష్టతలను కూడా సదరు కథనాల్లో ఆంగ్ల పత్రికలు ప్రధానంగా ప్రస్తావించాయి. 700 మంత్రాలను పదివేల సార్లు పఠించడం, 100 అగ్ని గుండాల ఏర్పాటు తదితర అంశాలను ప్రముఖంగా పేర్కొన్నాయి. మత విశ్వాసాలపై అపార నమ్మకమున్న రాజకీయ నేతగా కేసీఆర్ ను ఆ పత్రికలు అభివర్ణించాయి.