: 9న భేటీ కానున్న రాజధాని నిర్మాణ సలహా కమిటీ... హాజరు కానున్న ఖూ తెంగ్ చే


ఈ నెల 9న ఏపీ రాజధాని నిర్మాణ సలహా కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీకి 'సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సింగపూర్ పట్టణ పునర్ అభివృద్ధి అథారిటీ సీఈవోగా పనిచేసిన ఖూ తెంగ్ చే హాజరవుతున్నారు. నిర్మాణ సలహా మండలి కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు ఆయన ఏపీలో పర్యటిస్తారు. రాజధాని సమగ్ర ప్రణాళిక ఎలా ఉండాలి? మౌలిక సదుపాయాలు, భవనాలు, రవాణా తదితర అంశాలపై ఆయన చిత్ర ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News