: తెలుగు రాకపోయినా పాటలు చేయమని అవకాశం ఇస్తున్నారు: మిక్కీ జే మేయర్
తెలుగు రాకపోయినా తనకు అవకాశమిస్తున్న దర్శకులకు ధన్యవాదాలని ముకుంద సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ పేర్కొన్నారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన ముకుంద ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తనను, తన సంగీతాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఆదరించడం తనను ఎంతో సంతోషానికి గురి చేస్తోందని అన్నారు. టాలెంట్ ను తెలుగు సినీ పరిశ్రమ ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.