: 'ముకుంద' ఆడియో విడుదల నేడే...మెగా ఫ్యామిలీ సందడి
మెగా అభిమానులకు నేడు సందడే సందడి. మెగా ఫ్యామిలీ మొత్తం ముకుందా ఆడియో వేడుకలో సందడి చేయనున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'ముంకుంద' సినిమా ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.