: ఇంటర్ ఉమ్మడి పరీక్షల అంశాన్ని కేంద్రానికి చెప్పాం: మంత్రి గంటా
ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలన్న అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించడానికే చివరి క్షణం వరకూ ప్రయత్నిస్తామని మీడియాకు చెప్పారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా సహకరించడం లేదన్నారు. పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ఏపీలో అమలు చేసేందుకు తాము సిద్ధమేనన్నారు.