: మరోసారి వివాదాస్పదమైన శ్రీవారి ప్రధానార్చకుడి వ్యవహారశైలి


ఓ ప్రైవేటు అతిథి గృహంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఆశీర్వచనం ఇవ్వటం వివాదాస్పదమైంది. తిరుమలలో మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి మనవరాలు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు రమణ దీక్షితులు స్వయంగా హాజరయ్యారు. ఆ పాపకు ఆశీర్వచనం ఇచ్చిన తరువాత, మీడియాను చూసి ఆయన వెళ్లిపోయారు. ఏదో పనిపై ఇక్కడికి వచ్చిన రమణ దీక్షితులు తమ మనవరాలు పుట్టినరోజని తెలుసుకొని, పెద్దమనసుతో ఆశీర్వదించి వెళ్ళారని సురేష్‌రెడ్డి మీడియాకు వివరించారు. శ్రీవారి ప్రధానార్చకుడిగా ఉంటూ ఇలా చేయరాదన్న నిబంధనలున్నా, వాటిని రమణ దీక్షితులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. గతంలో కూడా రమణ దీక్షితులు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లకు వెళ్లి ప్రముఖులకు ఆశీర్వచనాలు అందించి వివాదాస్పదమయ్యారు.

  • Loading...

More Telugu News