: శ్రీకాంతాచారికి నివాళి అర్పించిన టీఆర్ఎస్ ఎంపీలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన శ్రీకాంతాచారి చిత్రపటానికి టీఆర్ఎస్ ఎంపీలు నివాళి అర్పించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ, 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన రావడానికి శ్రీకాంతాచారి బలిదానమే ప్రధానమైనదని అన్నారు.