: రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా జగన్ అనర్హుడు: సోమిరెడ్డి


అవినీతి కేసుల్లో నిండా మునిగిపోయిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనర్హుడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్ అవినీతి భాగోతంపై నిప్పులు చెరిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. సదరు అవినీతికి సంబంధించి జగన్ పై సీబీఐ 11 కేసులను నమోదు చేసిందని గుర్తు చేశారు. అవినీతికి పాల్పడ్డ జగన్, 16 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపారన్నారు. ఇంత నేర చరిత్ర ఉన్న జగన్ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనర్హుడని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News